కాజీపేట మండలం మడికొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇటీవల రాజ్యసభ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘం శుక్రవారం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు ఏడ బోయిన ప్రభాకర్, కార్యదర్శి జవ్వాజి కిషన్, జిట్ట అనిల్, చెన్నమల భాస్కర్, దాసరి వీరేష్, సదానందం, యువకులు, మహిళలు పాల్గొన్నారు.