మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: జడ్పిటిసి

187చూసినవారు
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: జడ్పిటిసి
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని జెడ్పిటిసి సింగిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సభ ప్రాంగణంలో ఎంపీపీ కమల పంతులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండల అభివృద్ధి అధికారులు మండల ప్రజా ప్రతినిధులు మండల ప్రజలు సహకరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అందులో భాగంగా మండల అభివృద్ధికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరోరి రమేష్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్