కాజీపేట జంక్షన్ లో ట్రాఫిక్ సీఐ ఆదేశాల మేరకు ఆటో పాయింట్ మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ సూచనల ప్రకారం ఒక క్రమ పద్దతిలో ఆటోలు నడుపుకోవాలని తెలియజేశారు. ప్రతి గ్రామానికి రెండు ఆటోలు చొప్పున లైన్ లో ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అతిక్రమించిన వారికి ఫైన్ లు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.