వర్ధన్నపేట: పట్టణంలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. హుండీలను ఎత్తుకెళ్లి పగలగొట్టి నగదు తీసుకోవడంతో పాటు అమ్మవారి మెడలో ఉన్న పుస్తెలతాడు, ముక్కుపుడకను దొంగిలించారు. అదేవిధంగా మిల్లు వద్ద ఉన్న డబ్బాలో సైతం చోరీ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.