Apr 14, 2025, 23:04 IST/వర్ధన్నపేట
వర్ధన్నపేట
కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులపై టాస్క్ఫోర్స్ దాడులు
Apr 14, 2025, 23:04 IST
వరంగల్ బాలాజీ నగర్ లోని కూల్ టచ్ ఐస్ క్రీమ్ కంపెనీ లో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, తయారీ, గడువు తేదిలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా ఉన్న 8 రకాల, రూ. 83, 200/- విలువ గల ఐస్ క్రీమ్ ఉత్పత్తులను సోమవారం సాయంత్రం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.