బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. ఈ మేరకు ఆర్ఎల్జేపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఇకపై ఆ కూటమితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలినట్లైయింది.