శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి 41 గేట్ల ద్వారా నీటి విడుదల

77చూసినవారు
శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి 41 గేట్ల ద్వారా నీటి విడుదల
శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతోంది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది. దీంతో 3,24,000 క్యూసెక్కుల ఔట్ ఫ్లోను 41 వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఇన్‌ఫ్లోగా ఉంది. ఎస్సారెస్పీలో గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా 1,089 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 73.458 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్