కొండచరియలు విరిగిపడటంతో కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు సజీవ సమాధి కాగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం తమిళనాడు ఆపన్నహస్తం అందించింది. సీఎం నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ అధికారుల్ని ఆదేశించారు. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని కేరళకు పంపించనున్నట్లు వెల్లడించారు.