వయనాడ్‌ విలయం.. 60 దాటిన మృతుల సంఖ్య

85చూసినవారు
వయనాడ్‌ విలయం.. 60 దాటిన మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 60 దాటింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ విలయంలో 63 మంది జలసమాధి అయ్యారు. సుమారు 100 మందిదాకా గాయపడ్డారు. వారు మెప్పడిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇంకా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానిక మీడియా టీవీల్లో ప్రసారం చేస్తోంది.

సంబంధిత పోస్ట్