ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు తీర్పును అంగీకరిస్తున్నాం.. పోరు కొనసాగిస్తాం. అభివృద్ధి, స్థానికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ట్వీట్ చేశారు. కాలుష్యం, అధిక ధరలు, అవినీతి సమస్యలను లేవనెత్తుతూనే ఉంటామని వెల్లడించారు.