తెలంగాణలో ఈ నెల 26 నుండి ప్రజా ప్రభుత్వ సంక్షేమ ప్రస్థానంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని CM రేవంత్ తెలిపారు. ఈ నెల 26 నుండి.. 1. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేల “రైతు భరోసా” ఆర్థిక సాయం. 2.అర్హులైన ప్రతి వ్యవసాయ రైతు కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” సాయం. 3.పదేళ్ల తర్వాత తొలిసారిగా పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ.. పథకాలను ప్రారంభించబోతున్నామని జిల్లా కలెక్టర్ల సదస్సులో చెప్పారు.