తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ శాఖలోని సవాళ్లను ఎదుర్కొంటూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యూటర్ సిటీ అందుబాటులోకి వస్తే 29,440 మెగా వాట్ల డిమాండ్ ఉండనుందని తెలిపారు. అలాగే RRR పూర్తయితే 31,809 మెగా వాట్ల డిమాండ్ ఉండనుందని.. దానికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.