సన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన పల్మోసిల్ నిర్దిష్ట బ్యాచ్ నాణ్యత లేనిదిగా నిర్ధారణయ్యింది. అయితే ఆ నాణ్యతలేని ఉత్పత్తిని తాము తయారు చేయలేదనీ, అది నకిలీదని సన్‌ఫార్మా పేర్కొంది. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా తయారైన టెల్మా హెచ్ లోనూ నాణ్యత లేదని వెల్లడైంది. గ్లెన్‌మార్క్ సైతం నిర్దిష్ట బ్యాచ్‌ను తాము తయారు చేయలేదని వివరణ ఇచ్చింది. ఆ మందులు వారివి కాకుంటే మార్కెట్‌లోకి ఎలా వచ్చాయి. ఆయా మందులు వాడిన రోగుల సంగతి ఏమిటి? అన్నది సమాధానంలేని ప్రశ్నలే.