మహారాష్ట్రలో తాము అధికారంలోకి వస్తే అదానీ గ్రూపునకు అప్పగించిన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ధారావి నివాసితులు, వ్యాపారాలకు తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైతే కొత్త టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు. కాగా, అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.