ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన కేసు కక్ష సాధింపు కేసు అని తెలిసినా విచారణకు హాజరయ్యానని KTR అన్నారు. 'అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాపై అక్రమ కేసులు పెట్టారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. నాకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వినియోగించుకుంటా. సుప్రీంలో కూడా న్యాయ పోరాటం చేస్తాం. నా హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యా' అని చెప్పారు.