రైతు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా రూ.500 బోనస్ ఇస్తూ రైతు పండుగ చేసుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు. 'గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటం. కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం' అని అన్నారు.