భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై అభిమానంతో యూపీలోని ఉన్నావ్‌కి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు సాహసం చేశాడు. కార్తికేయ్ అనే పదో తరగతి విద్యార్థి కోహ్లీని చూడాలనుకున్నాడు. ఈ మేరకు కాన్పూర్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడనే విషయం తెలుసుకున్నాడు. దీంతో ఉన్నావ్ నుంచి 58 km దూరం కార్తికేయ్ సైకిల్‌పైనే వెళ్లి తన అభిమాన క్రికెటర్‌ను చూశాడు. ఆ బాలుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.