సాధారణంగా సోలార్ ప్యానెల్స్‌ను సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అయితే పెరోవ్‌స్కైట్ ప్యానెల్స్‌ను కాల్షియం టైటానేట్ అనే మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇదీ సెమీకండక్టర్. వెలుతురిని గ్రహించి దాని తీవ్రతను రెట్టింపు చేయడమే కాదు ప్రత్యేక కెపాసిటర్లలో ఎక్కువకాలం స్టోర్ చేసుకొనే సదుపాయం దీంట్లో ఉంది. పైగా 30 ఏండ్లపాటు ఏకబిగిన కరెంటును ఉత్పత్తి చేసే వీటి ధర సోలార్ ప్యానెల్స్ కంటే ఎంతో తక్కువ.