ఒక సర్వే నంబరులో పది ఎకరాలుంటే అందులో ఒక్క భాగస్వామి ఫిర్యాదు చేసినా మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్తోంది. ఏదైనా సర్వే నంబరులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు ఒక గుంట విస్తీర్ణంలో ఉన్నా... మొత్తం నిషేధిత జాబితాలో పెట్టారు. ఒక బైనంబరుపై ఫిర్యాదు వస్తే మొత్తం ఆగిపోయింది. గతంలో పహాణీలో 36 కాలమ్స్ ఉంటే, ధరణిలో ఒక్కటే పెట్టారు. దీంతో చాలా భూములు లిటిగేషన్‌లోకి వెళ్లాయి.
దరఖాస్తులో పొరపాటు ఉంటే ఆర్నెల్ల తర్వాత రిజెక్టు అవుతోంది.