ఆడపిల్లలు 8ఏళ్ల లోపు రజస్వల కావడాన్ని ప్రికోషియస్ ప్యూబర్టీ అంటారు. ఊబకాయం, అల్ట్రాప్రాసెస్డ్ ఆహారం, కొన్ని కాస్మొటిక్స్ వినియోగం వల్ల ముందస్తు రజస్వల అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఎత్తు పెరగడం ఆగిపోతుందని, శరీరం ఎదిగినా మానసిక పరిణతి ఉండదని, లైంగిక హింసకు గురయ్యే అవకాశాలూ ఉంటాయని పేర్కొన్నారు. పిల్లలకు మాంసాహారం తగ్గించి, ఆటల్ని ప్రోత్సహించాలని సూచించారు.