మన దేశంలో రాజకీయ పార్టీ పెట్టాలంటే నిబంధనలేమిటి?

56చూసినవారు
మన దేశంలో రాజకీయ పార్టీ పెట్టాలంటే నిబంధనలేమిటి?
దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత దానిని ఎన్నికల కమిషన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ఎన్నికల సంఘం జారీ చేసిన దరఖాస్తు ఫారాన్ని ఆన్‌లైన్‌లో నింపాలి. ఆ ప్రింటౌట్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు జతచేసి, 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు పంపాలి. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.10వేలు డిపాజిట్ చేయాలి. అలాగే కనీసం 500 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

సంబంధిత పోస్ట్