ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే ముందు AISను సరి చూసుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. ఐటీ శాఖ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను 2021లో ప్రవేశపెట్టింది. ట్యాక్స్ పేయర్లు ఒక ఆర్థిక ఏడాదిలో చేసిన అన్ని ట్రాన్సాక్షన్ల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వివరాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఈ వార్షిక సమాచార నివేదికను తీసుకొచ్చింది. AIS అనేది ట్యాక్స్ పాస్‌బుక్ అని చెప్పవచ్చు.