సాధారణ నియామక పద్ధతులను తప్పించి ప్రొఫెషనల్స్ ను నేరుగా వివిధ హోదాల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించడాన్ని 'లేటరల్ ఎంట్రీ' అంటారు. ప్రభుత్వ శాఖల్లో సెక్రటరీలుగా, డైరెక్టర్లుగా ప్రైవేటు వ్యక్తులను నియమించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. యూపీఎస్సీ తాజాగా ఇలాంటి 45 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే దీని వల్ల అణగారిన వర్గాలకు ఉన్నత హోదాలు దక్కవని విపక్షాల వాదిస్తున్నాయి.