అకాల వర్షాలకు చాలా మంది రైతులు నష్టపోతుంటారు. భారీ వర్షాలు కురిసిన కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలా కాకుండా రైతులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలి. అన్నదాతలకు సరైన అవగాహన ఇచ్చి, పంట దిగుబడిని కాపాడుకునేలా చేయాలి.