తైవాన్ రాజధాని తైపీలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. భూకంపం ధాటికి తైపీలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తైవాన్‌లోని హువాలియన్ నగరానికి 18 కి.మీ దూరంలో 34.8 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.