పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇక రిటర్న్స్ ఫైల్ చేశాక 4-5వారాల్లో రీఫండ్ ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఈ-వెరిఫికేషన్ పూర్తయితేనే రీఫండ్ వస్తుంది. PANలో ఉన్న వివరాల్లో తప్పులున్నా, బ్యాంక్ అకౌంట్ ముందుగా ధ్రువీకరించకపోయినా రీఫండ్ రాదు. రీఫండ్ రాకపోతే ఐటీ శాఖ నుంచి ఏదైనా ఈమెయిల్ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. ఏమైనా లోపాలు ఉన్నట్లు పేర్కొన్నారేమో గమనించాలి.