AP: తన అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. అభిమానులకు ఎక్కడ ఎలా స్పందించాలో తెలియాలి అని అన్నారు. ప్రమాద సమయాల్లో కేరింతలు అనవసరమని, కేరింతలు.. అరుపులకు బదులు పోలీసులకు సహకరించాలని సూచించారు. తిరుపతి ఘటన చూశాం.. ఎవరి బాధ్యత వాళ్లు సరిగా చేస్తే సరిపోయేది. కొంతమంది చేసిన తప్పు వల్ల జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అని పవన్ పేర్కొన్నారు.