మారుతున్న జీవన విధానంలో అధిక బరువు అందరినీ వేధిస్తున్న సమస్య. అయితే వాకింగ్, జాగింగ్ రెండూ ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. రోజూ 30 నిమిషాలు చురుగ్గా వాకింగ్ చేస్తే 150-200 కేలరీలు, జాగింగ్ చేస్తే 300-400 కేలరీలు బర్న్ అవుతాయి. ఇక వాకింగ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు, కాళ్ల నొప్పులు ఉన్న వారు, గుండె ఆపరేషన్లు అయినవారు జాగింగ్‌కు దూరంగా ఉండటమే మంచిది.