నాసాకు చెందిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' వ్యోమనౌక సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లి, అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమ నౌకగా రికార్డు సృష్టించింది. సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018లో నాసా ప్రయోగించింది. ఏడేళ్లు పనిచేసేలా ఈ వ్యోమనౌకను రూపొందించారు. తొలిసారి 2021 ఏప్రిల్ 28న కక్ష్యలోకి ప్రవేశించింది. డిసెంబరు 24న మాత్రం ఇంతకుముందెన్నడూ లేనంత దగ్గరగా వెళ్లింది.