రేపటి నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లకు భారత జట్టులో కీపర్ ఎంపిక కీలకం కానుంది. భారత జట్టులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరిని విశ్వసిస్తుందో చూడాలి. అయితే కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మధ్య ఎవరికో ఒకరికి అవకాశం లభించనుంది.