ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ముఖచిత్రాన్ని మార్చివేశారని కొనియాడారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవా భావం స్మరించుకోదగిందని చెప్పారు. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలందించారని పేర్కొన్నారు. ఎన్నో కీలక పదవులు అధిష్ఠించినా సామాన్య జీవితం గడిపారన్నారు. తన తరఫున, దేశం తరఫున నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.