సంక్రాంతి రోజు పతంగులు ఎందుకు ఎగరవేస్తారు..?

68చూసినవారు
సంక్రాంతి రోజు పతంగులు ఎందుకు ఎగరవేస్తారు..?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తుంటాయి. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సంక్రాంతి పండుగకే గాలిపటాలు ఎగరవేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగతో చలికాలం పూర్తై వసంత కాలంలోకి ఆహ్వానం పలకడం కోసం గాలిపటాలను ఎగురవేస్తారు. ఆధ్యాత్మికంగా మరో కారణం కూడా ఉంది. ఆరు నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని వారికి ఆహ్వానం పలికేందుకు పతంగులను ఎగరవేస్తారని అంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్