గత BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ఎందుకు చేయట్లేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 'ధరణి రూ.లక్షల కోట్ల కుంభకోణం అని ప్రభుత్వం అంటుంది. మరి విచారణ ఎందుకు చేయట్లేదు. ఏడాదైనా ధరణి కుంభకోణంపై విచారణ ఎందుకు చేయలేదు. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలు బయటపెడతాం అన్నారు. ధరణి అక్రమాలపై విచారణను సీబీఐకి ఎందుకు ఇవ్వలేదు' అని మండిపడ్డారు.