రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎర్ర రంగు (రెడ్ బాల్)తో పోలిస్తే గులాబీ రంగు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ కారణం చేతనే డే&నైట్ టెస్టుల్లో పింక్ బాల్ ను ఉపయోగిస్తారు. సాంప్రదాయకంగా టెస్ట్ క్రికెట్ కోసం ఎరుపు రంగు బంతులను ఉపయోగిస్తుండగా, ఇవి తక్కువ ప్రతిబింబించే కారణంగా పగటిపూట కనిపించినంత స్పష్టంగా రాత్రులలో కనిపించవు. దీంతో కాస్త వెలుతురు (సూర్యాస్తమయం) తగ్గగానే అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేస్తుంటారు.