కేటీఆర్ ఆమరణ దీక్ష చేస్తే మద్దతిస్తా: సీఎం రేవంత్

540చూసినవారు
కేటీఆర్ ఆమరణ దీక్ష చేస్తే మద్దతిస్తా: సీఎం రేవంత్
మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా చేసుకొని సీఎం రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. 'కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్ లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మేం మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్