పట్టణ ప్రాంతాల్లో పన్నులు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పినా ఆచరణ భిన్నంగా ఉంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తానని హామీనిచ్చినా ఆ దిశలో చర్యలు లేవు. స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ఇదే స్థితి. ఇటీవల ఆదానీ కంపెనీ నుండి వాటిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పలు సంక్షేమ పథకాలకు పేర్లు మార్చారు. జగనన్న గోరుముద్ద, అమ్మఒడి వంటి పథకాల పేర్లతోపాటు సుమారు 28 సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు చేశారు.