విభజన హామీల అమలు విషయంలో అడుగుముందుకు పడలేదు. ప్రత్యేకహోదా గురించి కూటమి నేతలు మాట్లాడే పరిస్థితిలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం కార్మికులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ ఆందోళనలను ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయంలో గందరగోళంగా మారిన రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. అమరావతికి కేంద్రం నుండి రూ.3వేల కోట్లు వచ్చాయి. మరో 15 వేల కోట్ల రుపాయలను రుణంగా ఇప్పిస్తామని కేంద్రం ప్రకటించింది.