TG: ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రైతు భరోసా అమలుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రేవంత్ సర్కార్ ఎవరినీ మినహాయించకుండా పంట వేసిన ప్రతి ఒక్కరికీ ఇవ్వడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఏడాదిలో రెండు పంటలు కాకుండా ఒకే పంట వేసే వారికి, పండ్ల తోటలు, పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా ఎలా చెల్లించాలనే మార్గదర్శకాలు 4న కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది.