ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని పలకరించి మాట్లాడారు. వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయన్నారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో కలిసి పని చేస్తామని మోదీ చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు, లావు, శబరి, వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.