రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని BRS నేత హరీశ్‌రావు విమర్శించారు. 'నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరిగిందంటే.. ప్లేస్ చెప్పు.. టైమ్ చెప్పు.. ఏ జిల్లాకు పోదాం.. ఏ మండలానికి పోదాం.. ఏ గ్రామానికి పోదాం..నా నియోజకవర్గానికి వస్తావా? నీ నియోజకవర్గానికి పోదామా? ఎక్కడికి పోదామో డిసైడ్ చేయ్యి.. అక్కడికి వెళ్లి ఆ ఊరి రైతులను అడుగుదాం.. ఖుల్లాం ఖుల్లా రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చేద్దాం' అని సీఎంకు సవాలు విసిరారు.