ఏడుస్తున్న చిన్నారికి తల్లి అయిన మహిళా పోలీసు (Trending)

1065చూసినవారు
ఏడుస్తున్న చిన్నారికి తల్లి అయిన మహిళా పోలీసు (Trending)
గుజరాత్ హైకోర్టు ప్యూన్ పోస్టుకు హాజరు కావడానికి ఒక మహిళ తన 6 నెలల పాపతో ఓధవ్ పరీక్షా కేంద్రానికి వచ్చింది. మరికొద్ది నిమిషాల్లో పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో తల్లి చేతిలో ఉన్న చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. ఈ సమయంలో మహిళా కానిస్టేబుల్ చిన్నారిని చూసుకునేందుకు ముందుకు వచ్చింది. స్వయంగా తల్లిలా చిన్నారి ఏడవకుండా శాంతింపజేసింది. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్