ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఆతిశీ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో కొన్నాళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పారు. అలాగే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో ఆతిశీ కీలక పాత్ర పోషించారు. స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు.