కారు ఢీ.. ఇంటి గోడకు తలకిందులుగా వేలాడిన మహిళ (VIDEO)

65చూసినవారు
కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ గాల్లో ఎగిరిపడ్డ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తి బిజై కాపికాడ్‌లో బైక్‌పై వెళ్తున్న మురళిని హత్యాయత్నం చేయడానికి కారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఆ సమయంలో అటుగా రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళను కూడా కారు ఢీకొనడంతో ఆమె గాల్లో ఎగిరి ఓ ఇంటి గోడకు తలకిందులుగా వేలాడారు. మురళి, మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్