గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇంకా 30 మంది అపార్ట్‌మెంట్ లోపల చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ టీంలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. అధికారులు ప్రస్తుతం చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.