హోలీ సందర్భంగా లఖ్‌నవూలోని ఓ స్వీట్ షాపు దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారుచేసి రికార్డు సృష్టించింది. ఆరు కేజీల బరువుతో 25 అంగుళాలు ఉన్న ఈ కజ్జికాయ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈవిషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఈ మిఠాయిని మువ్వన్నెల రంగుల్లో ప్రత్యేకంగా తయారుచేయడం విశేషం.