వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేశారని ఆందోళన(వీడియో)

570చూసినవారు
ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఎగ్ రోల్ డెలివరీ చేసి షాకిచ్చింది ఓ రెస్టారెంట్. యుపిలోని మీరట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 'ఫాదర్ ఆఫ్ రోల్స్ రెస్టారెంట్' నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు. నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్