ఒలింపిక్స్ బరిలో నిలిచిన ఏకైక భారత పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఆశలు రేపి.. తర్వాత తడబడ్డాడు. పురుషుల 57 కేజీల విభాగంలో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. గురువారం సెమీస్‌లో అయిదో సీడ్ అమన్ 0-10 తేడాతో రీ హిగుచి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. నేడు జరిగే కాంస్య పతక పోరులో డారియన్ (ప్యూర్టోరికా)తో అమన్ తలపడనున్నాడు.