ప్రపంచ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన మానెపల్లి హీల్స్ పై నిర్మించిన స్వర్ణగిరి క్షేత్రంలో మన తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్ ను స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపికృష్ణ లు ఆలాయ ప్రధాన అర్చకులతో కలిసి సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రిక రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ అనుదినం జనస్వరం వినిపిస్తు సమాజంలో దూసుకుపోతోందన్నారు.