కార్మికుల హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి బోలాగాని సత్యనారాయణ అన్నారు. సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల సహాయ కార్యదర్శి అలెటి బాలరాజు అధ్యక్షుతన నిర్వహించారు.