తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీ కారణంగా ఖాళీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనానికి గంట, ఉచిత దర్శనానికి 3గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.